హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలకు ఏర్పాట్లు

KDP: ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సెప్టెంబర్ 2న ఘనంగా నిర్వహించనున్నట్లు రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతికారి కృష్ణ తెలిపారు. సిద్ధవటం నుంచి 500 మందికి పైగా బైక్‌లతో ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. యువతను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.