హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుంచి ప్యానల్ ఇన్‌స్పెక్షన్ టీమ్స్ సందర్శన

MLG: ములుగులోని పాఠశాలల్లో సెప్టెంబర్1నుంచి ప్యానల్ ఇన్‌స్పెక్షన్ టీమ్స్ సందర్శించనున్నట్లు DEO ఏ సిద్ధార్థ రెడ్డి తెలిపారు. సోమవారం నిర్వహించిన సమీక్షలో పాఠశాలల పరిశీలన, ఉపాధ్యాయులకు నిర్మాణాత్మక సూచనలు, ఎఫ్ఎల్ఎన్ అమలుపై దిశానిర్దేశం చేయాలని సూచించారు. జాతీయ విద్యా విధానం-2020 ప్రకారం విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు కృషి చేయాలని కోరారు.