హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రభుత్వ భూమి, ప్రజా బాటలను పరిరక్షించాలి'

KNR: శంకరపట్నం మండలం కన్నాపూర్‌లోని ప్రభుత్వ భూమి, ప్రజలు ఏళ్లుగా వినియోగిస్తున్న బాటలను పరిరక్షించాలని యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు గోర్ల అంజనేయులు యాదవ్ కోరారు. ఈ మేరకు హుజూరాబాద్ ఆర్డీవో జలకుమారికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ భూమికి హద్దులు నిర్ణయించి, బాటలను సర్వే చేసి ఆక్రమణలు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.