హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సిబ్బందికి వెంటనే జీతాలు చెల్లించాలి'

విశాఖ అక్షయ్ హాస్పిటల్ వద్ద కార్మికులు శాంతియుత ధర్నా నిర్వహించారు. ఈ నిరసనలో AITUC రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. హాస్పిటల్ బోర్డ్ డైరెక్టర్, యాజమాన్యం పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. వారు తమ అనుచరులతో కలిసి ఆర్థిక లావాదేవీలు నడుపుతున్నారని ఆరోపించారు. 36 మంది కార్మికులకు గత 6 నెలలుగా జీతాలు చెల్లించలేదని, ఇందులో అత్యధికంగా మహిళా కార్మికులే ఉన్నారన్నారు.