హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దోమల నివారణకు ప్రత్యేక చర్యలు'

ADB: ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు గ్రామ సర్పంచ్ ఏలేటి నీలిమ పేర్కొన్నారు. వర్షాకాలంలో దోమల బెడద, వ్యాధులు ప్రబలకుండా గ్రామంలోని ప్రధాన వీధులు, మురుగు కాలువలు, నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో సోమవారం దోమల నివారణ మందు పిచికారీ చేయించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు.