హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ACB వలకు చిక్కిన పంచాయతీ సెక్రటరీ

అనంతపురం జిల్లా రుద్రంపేట పంచాయతీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పంచాయతీ సెక్రటరీ హిదయతుల్లా రూ. 8 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి ప్లాన్‌ అప్రూవల్‌ కోసం నాగేంద్ర అనే వ్యక్తిని లంచం డిమాండ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. పంచాయతీ కార్యాలయంలోనే నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.