హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారీగా రేషన్ బియ్యం పట్టివేత..!

MHBD: మరిపెడ పట్టణం కేంద్రంలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 300 బస్తాల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. సోమవారం అధికారులు తనిఖీలు నిర్వహించి అక్రమంగా నిల్వ చేసిన బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బియ్యాన్ని సీజ్ చేసి, ఘటనపై కేసు నమోదు చేశారు. అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేసి తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.