హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజా దర్బార్‌కు 52 వినతులు'

VZM: ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. సోమవారం ఎల్.కోట క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 52 వినతులు రాగా, అందులో అత్యధికంగా సామాజిక పింఛన్లపై 29 దరఖాస్తులు వచ్చాయన్నారు.