అన్నమయ్య: రైల్వేకోడూరు పట్టణంలోని అన్న క్యాంటీన్‌ను టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్, కుడా ఛైర్మన్ ముక్కా రూపానందరెడ్డి పరిశీలించారు. భోజనం నాణ్యత, పారిశుద్ధ్యం, సౌకర్యాలను పరిశీలించి ప్రజలతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అన్న క్యాంటీన్‌లో భోజనం నాణ్యతపై పరిశీలన


