హైదరాబాద్: 28°C
క్రీడలు

దులీప్ ట్రోఫీలో తిలక్ వర్మ సెంచరీ

దులీప్ ట్రోఫీ సెమీఫైనల్‌లో సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ అద్భుతమైన శతకంతో జట్టును ఆదుకున్నాడు. నార్త్ జోన్‌తో జరుగుతున్న ఈ కీలక పోరులో సౌత్ జోన్ కేవలం 85 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో తిలక్ వర్మ.. సంయమనంతో ఆడుతూ అజేయంగా 106 పరుగులు (225 బంతుల్లో) సాధించాడు. దీంతో సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.