హైదరాబాద్: 28°C
క్రీడలు

టీమిండియాలోకి కృనాల్ పాండ్యా రీఎంట్రీ?

కృనాల్ పాండ్యా ఐదేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. త్వరలో జరగనున్న ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌ కోసం సెలక్టర్లు అతడి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల్లో విఫలమైన అక్షర్ పటేల్ స్థానంలో, IPLలో అద్భుత ప్రదర్శన కనబరిచిన కృనాల్‌ను ఎంపిక చేయాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.