హైదరాబాద్: 28°C
క్రీడలు

యూఎస్ ఓపెన్.. తొలి రౌండ్‌లోనే సంచలనం

అమెరికాలో జరుగుతున్న యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సంచలనం నమోదైంది. వెటరన్ టెన్నిస్ స్టార్, మాజీ ఛాంపియన్ వీనస్ విలియమ్స్ తొలి రౌండ్‌లోనే ఘోర పరాజయాన్ని చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అమెరికాకే చెందిన మరో స్టార్ ప్లేయర్ సోఫియా కెనిన్ చేతిలో 6-2, 7-6 (8/6) వరుస సెట్లలో వీనస్ ఓటమిపాలైంది. ఈ ఓటమితో వీనస్ ప్రయాణం మొదటి రౌండ్‌లోనే ముగిసింది.