హైదరాబాద్: 28°C
క్రీడలు

సూర్యవంశీ విధ్వంసం.. తృటిలో సెంచరీ మిస్

దులీప్ ట్రోఫీ సెమీఫైనల్‌లో సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అద్భుత బ్యాటింగ్‌తో చెలరేగాడు. కేవలం 81 బంతుల్లోనే 92 పరుగులు చేసి తృటిలో సెంచరీ కోల్పోయాడు. అంతకుముందు సెంట్రల్ జోన్ తన తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులు చేయగా, ఈస్ట్ జోన్ కూడా సరిగ్గా అదే స్కోరుకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్ స్కోర్లు సమం అయ్యాయి.