హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా కప్.. హాంకాంగ్‌తో తదుపరి పోరు

మహిళల ఆసియా కప్ గ్రూప్-ఏలో భాగంగా థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్ తన తదుపరి మ్యాచ్‌లో హాంకాంగ్‌తో తలపడనుంది. సెప్టెంబర్ 3న దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. కాగా, సెప్టెంబర్ 5న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్ ఢీకొంటుంది.