హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీటి రోడ్డు పనులకు శంకుస్థాపన

RR: తలకొండపల్లి మండలం చుక్కగుట్ట తండా నుంచి జూలపల్లి వరకు రూ.1.10 కోట్లతో ఒక కిలోమీటర్ బీటీ రోడ్డుకు స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. అలాగే జూలపల్లి నుంచి చంద్రధన రూ.2.40 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బీటి రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు.