హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఉద్యోగుల హక్కుల కోసం దశలవారీ ఉద్యమం'

E.G: రాజమహేంద్రవరంలో ఏపీ జేఏసీ అమరావతి, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కలెక్టర్ కీర్తి చేకూరిని కలిసి సోమవారం మెమొరాండం అందజేశారు. ఉద్యోగుల హక్కులు, ఆత్మగౌరవం, ఆర్థిక ప్రయోజనాల సాధన కోసం దశలవారీ ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు, నిరసనలు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.