హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి'

ELR: పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా అందిన అర్జీలను సమగ్రంగా పరిశీలించి బాధితులకు శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ కే.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో పలు సమస్యలపై మొత్తం 403 అర్జీలు వచ్చాయన్నారు. వాటిపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామన్నారు.