హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వైద్య కోర్సుల ఫీజుల పెంపు రద్దు చేయాలి'

సత్యసాయి: రాష్ట్రంలో వైద్య కోర్సుల ఫీజుల పెంపును వెంటనే రద్దు చేయాలని హిందూపురంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు బాబావలి డిమాండ్ చేశారు. ప్రైవేట్ వైద్య, దంత వైద్య కోర్సుల ఫీజులు 10 శాతం, పీజీ ఫీజులు 15 శాతం పెంచడం పేద, మధ్యతరగతి విద్యార్థులపై భారం అన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులతో చర్చించకుండా పెంపు నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు.