హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట

KDP: సిద్ధవటం పెన్నానది పరివాహక ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసినట్లు తహసీల్దార్ విజయ్‌కుమార్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఉక్కాయపల్లి సమీపంలోని ఊరగాయవంక వద్ద జేసీబీలతో ఇసుక తవ్వి కడపకు తరలిస్తున్నట్లు రైతుల ఫిర్యాదుతో చర్యలు చేపట్టామన్నారు. గృహ అవసరాలకే ఇసుకను ట్రాక్టర్ల ద్వారా ఉచితంగా తరలించుకోవచ్చని తెలిపారు.