హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ను ఎమ్మెల్సీ సోము వీర్రాజు కలిసి కుల ధ్రువీకరణ పత్రాల సమస్యను వివరించారు. సంచార జాతుల వర్గానికి చెందిన బేడ బుడగ జంగం కులస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ జాప్యం లేకుండా ధ్రువీకరణ పత్రాలు అందించాలని కోరారు. సమస్యను సానుకూలంగా పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.