హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలి: ఎస్పీ

కడప జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన PGRSలో ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ ప్రజల నుంచి 117 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి, చట్టపరిధిలో నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. బాధితుల సమస్యలను సానుభూతితో విని న్యాయం చేయాలని సూచించారు.