హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధ్యాయుడి సేవలకు ఎమ్మెల్యే అభినందన

NGKL: తుడుకూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు అల్వాల వెంకట నర్సింహారెడ్డి పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులకు ఎన్నో ఏళ్లుగా నిబద్ధతతో విద్యాబోధన చేసిన వెంకట నర్సింహారెడ్డి సేవలను అభినందించారు. పదవీ విరమణ అనంతరం ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.