హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'క్యాంపస్ నుంచే కార్పొరేట్‌కు సిద్ధం కావాలి'

SKLM: నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని క్యాంపస్ నుంచే కార్పొరేట్ ప్రపంచానికి సిద్ధం కావాలని టీసీఎస్ ప్రెసిడెంట్ రాజన్న అన్నారు. టెక్కలి సమీపంలో ఐతం కళాశాల రజతోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన 'క్యాంపస్ టు కార్పొరేట్' కార్యక్రమంలో ఆయన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి, నూతన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఆధునిక సాంకేతికతల్లో నైపుణ్యం పెంచుకోవాలన్నారు.