అన్నమయ్య: మదనపల్లె జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి 71 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో 30 భూ వివాదాలు, 10 ఆర్థిక వివాదాలు, 10 ఘర్షణలు, 7 సైబర్/మోసం కేసులు ఉన్నాయి. భూకబ్జాలు, వడ్డీ వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 71 ఫిర్యాదులు


