హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్లోబల్ ఎడ్యుకేషనల్ అవార్డుకు గణేష్ ఎంపిక

JN: వెల్ది మోడల్ స్కూల్‌లో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గణేష్ ప్రతిష్టాత్మక గ్లోబల్ ఎడ్యుకేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు. విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా గణేష్‌ను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అవార్డు ప్రదానోత్సవం సెప్టెంబర్ 13న ఏపీలోని గుంటూరు మెడికల్ కాలేజీ క్యాంపస్‌లో జరగనుంది.