హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'అభివృద్ధి పనులు చేపట్టండి'

NDL: డోన్ MLA కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డికి అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే వైసీపీ హయాంలో ప్రారంభించి నిలిచిపోయిన పనులను పూర్తి చేయాలని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. 'రెండేళ్ల టీడీపీ పాలనలో ఎంత మేరకు అభివృద్ధి పనులు చేపట్టారు? బేతంచర్లలో పాలిటెక్నిక్ బిల్డింగ్ పూర్తి చేయండి, డోన్‌కు హార్టికల్చర్ కాలేజీ తీసుకురండి' అని కోరారు.