హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి'

NTR: విజయవాడలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ ఐఏఎస్‌ను ఏపీ రజక ఎస్సీ సాధన కమిటీ నాయకులు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. రజకుల సామాజిక, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కమిటీ నాయకులు విజ్ఞప్తి చేశారు.