హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంచాయతీ సమస్యలపై వినతిపత్రం

JN: రఘునాథపల్లిలో నిర్వహించిన ప్రజావాణిలో కుసుంబాయి తండా సర్పంచ్ స్వరూప రాజేందర్ నాయక్ వినతిపత్రం సమర్పించారు. పంచాయతీకి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు ఖాతాల్లో జమ కాలేదని తెలిపారు. పెండింగ్ విద్యుత్ బిల్లుల భారం, గ్రామంలో విద్యుత్ స్తంభాల కొరత సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు.