W.G: ఉండి పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. కార్మికులకు సెలవులు లేవని చెప్పడంతో పాటు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శి వైఖరిని వారు తప్పుపట్టారు. పనిగంటల పేరుతో జరుగుతున్న దోపిడీ, కార్మికులపై వేధింపులను అరికట్టాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సీఐటీయూ


