హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీసీఎంను విధుల నుంచి తొలగించాలని వినతి

W.G: ఆశా కార్యకర్తలను లైంగికంగా వేధిస్తూ మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్న ఉమ్మడి జిల్లాల డీసీఎం వెంకట్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ సిరిబేగం, సీహెచ్ లక్ష్మి డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా డీఆర్వో గ్లోరియాకు వినతిపత్రం అందజేశారు. డీసీఎంను తొలగించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు.