హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెలిగొండను పర్యాటకంగా తీర్చిదిద్దుతాం: మంత్రి

E.G: వెలిగొండ ప్రాజెక్టును ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా తొలి దశ నీటి విడుదల చారిత్రాత్మక ఘట్టమన్నారు. శ్రీశైలం, త్రిపురాంతకం, కంభం, భైరవకోన, నల్లమలను కలుపుతూ ప్రత్యేక టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో స్థానిక యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.