విశాఖలో ఏఐజీ హాస్పిటల్స్‌కు మంత్రి నారా లోకేష్ సోమవారం భూమిపూజ, శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 9 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందనున్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే, విశాఖ అభివృద్ధి, యువతకు అవకాశాల కల్పనలో ఇది మరో ముందడుగు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏఐజీ హాస్పిటల్స్‌కు మంత్రి శంకుస్థాపన


