హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సమస్యలు ఎదురైతే ధైర్యంగా ఉండాలి'

ELR: జంగారెడ్డిగూడెం ZPH స్కూల్లో రాష్ట్ర చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ మెంబర్ గాంధీ బాబు పర్యటించారు. విద్యార్థులకు ఉన్న వివిధ హక్కులపై ఆయన అవగాహన కల్పించారు. పాఠశాలలో గానీ, బయట గానీ ఏవైనా సమస్యలు ఎదురైతే భయపడకుండా, ధైర్యంగా ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.