హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాపూరు అటవీశాఖ రేంజ్ అధికారిగా జ్యోతి ఆనంద్

NLR: రాపూరు అటవీశాఖ రేంజ్ అధికారిగా జ్యోతి ఆనంద్ రాపూరు అటవీశాఖ కార్యాలయంలో ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ ఇంచార్జ్ రేంజ్ అధికారిగా పని చేస్తున్న మాల్యాద్రి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. అటవీ సంపద, వన్యప్రాణుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని, అడవుల నరికివేత, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.