హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రైవేట్ కళాశాలల్లో క్రీడా మైదానాలపై కలెక్టర్‌కు వినతి

శ్రీ సత్యసాయి జిల్లాలోని పలు ప్రైవేట్ కళాశాలల్లో క్రీడా మైదానాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని జనతా వారధి జిల్లా ఇన్‌చార్జ్ హరికృష్ణ గౌడ్, బీజేపీ నాయకులు తెలిపారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి క్రీడలు కీలకమని వివరించారు.