హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ

KDP: సిద్ధవటంలోని శ్రీకామాక్షీసమేత సిద్ధవటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. వేదపారాయణాలు, పూర్ణాహుతి అనంతరం శాస్త్రోక్తంగా ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. కార్యక్రమంలో శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్‌నాయుడు, ఈవో శ్రీనివాసరావు, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు.