హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

కృష్ణా: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంజూరు చేసిన సాస్కి నిధులతో కోడూరు మండలంలో నూతన తారు రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. దీనిలో భాగంగా రెండు కొత్త రహదారుల నిర్మాణానికి అవనిగడ్డ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయని స్థానికులు అంటున్నారు.