హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: లంబాడీల సాంస్కృతిక ప్రదర్శనతో సందడి.!

ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం చంద్రబాబుకు లంబాడీలు ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ దుస్తుల్లో లంబాడీల సాంస్కృతిక పాటలు, నృత్యాలతో అలరించారు. వారి సంప్రదాయ నృత్యాలను సీఎం ఆసక్తిగా తిలకించారు. లంబాడీల కళా ప్రదర్శనతో సభా ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. ఇటు, అటు లంబాడీల మధ్య కృష్ణమ్మ జలాలు ప్రవహించే సన్నివేశం చూపరులను ఆకట్టుకుంది.