హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ప్రొద్దుటూరులో కలెక్టర్ సమీక్ష..!

KDP: ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధిపై మంగళవారం కలెక్టర్ శ్రీధర్ అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సూచన మేరకు మధ్యాహ్నం 3 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో సమావేశం జరగనుంది. అధికారులు ప్రగతి నివేదికలతో హాజరుకావాలని సూచించారు. గత సమావేశ తీర్మానాలు, ఆదేశాల అమలుపై కలెక్టర్ సమీక్షించనున్నారు.