హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురంలో మంత్రి పయ్యావుల ప్రజాదర్బార్

ATP: అనంతపురం రామ్ నగర్‌లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజాదర్బార్ నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వినతులను స్వీకరించిన మంత్రి, ప్రతి సమస్యను సానుకూలంగా పరిశీలించి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.