NZB: వనమహోత్సవంలో భాగంగా సోమవారం బర్దిపూర్ హెల్త్ సెంటర్ సమీపంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ కోట్ల భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, ఉపాధి హామీ సిబ్బంది, కార్యకర్తలు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సర్పంచ్ సూచించారు.
తెలంగాణ
బర్దిపూర్‌లో ఘనంగా వనమహోత్సవం


