హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫైర్ ఇంజన్ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడ అగ్నిమాపక శాఖ కార్యాలయానికి నూతనంగా మంజూరైన రూ.75 లక్షల విలువైన అడ్వాన్స్డ్ వాటర్ టెండర్ ఫైర్ వాహనం సోమవారం అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు నూతన ఫైర్ ఇంజన్ వాహనాన్ని ఎమ్మెల్యే రాము ప్రారంభించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడంలో అగ్నిమాపక శాఖ కీలక పాత్ర పోషిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.