హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మధ్యాహ్న భోజనం పరిశీలన

AKP: నక్కపల్లి మండలం జానకయ్యపేట ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఎంఈవో-2 రుత్తల నాగన్నదొర సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించి భోజనాన్ని రుచి చూశారు. వంటశాల, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి, చదవడం, రాయడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.