హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రజకులకు దోబీఘాట్లు నిర్మించాలి'

KRNL: రజకుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. రజకుల సంఘం మండల అధ్యక్షుడు సీ. మహేష్ కౌతాళం మండల ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. గ్రామాల్లో దోబీఘాట్లు నిర్మించి, ఎల్‌ఎల్‌సీ కాలువ ద్వారా వాటికి నీటిని నింపాలని కోరారు. నీటి సౌకర్యం లేక బట్టలు ఉతికేందుకు దూర ప్రాంతాల్లోని బోర్లు, బావుల వద్దకు వెళ్లాల్సి వస్తోందని మహేష్ తెలిపారు.