హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజల సమస్యల పరిష్కారమే మా లక్ష్యం'

ELR: ప్రజల సమస్యలను త్వరితగతిన, పారదర్శకంగా పరిష్కరించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం 'పబ్లిక్ గ్రీవెన్స్' కార్యక్రమంలో బాధితుల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, ఆర్థిక మోసాలకు సంబంధించి మొత్తం 48 ఫిర్యాదులు అందాయనీ వాటిని పరిశీలించి బాధితులకు న్యాయం చేస్తామన్నారు.