హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిన్నారుల థలసేమియా కోసం రక్తదాన శిబిరం

SKLM: పేద కుటుంబాలకు మనోధైర్యం డాక్టర్ ఇంజరాపు మోహన్ రావు అని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. శ్రీకాకుళంలో సోమవారం సత్యసాయి ప్రార్థనా మందిరంలో డాక్టర్ మోహన్ రావు జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. థలసేమియా చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన శిబిరాన్ని లక్ష్మీదేవి ప్రారంభించారు. ఒకరు ఇచ్చే రక్తం మరొకరి జీవితంలో వెలుగు నింపుతుందన్నారు.