NDL: సిరివెళ్ల–నంద్యాల జాతీయ రహదారిపై ఆటోలో పరిమితికి మించి కూలీలు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. ఆటోపై, వెనుక భాగంలో వేలాడుతూ వెళ్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రద్దీగా ఉండే హైవేపై ఇలాంటి ప్రయాణాలతో ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రమాదకరంగా ఆటోలో ప్రయాణం


