VZM: గజపతినగరం మండలం బంగారమ్మపేట గ్రామంలో సోమవారం ఎంపీడీవో కళ్యాణి రక్షిత మంచినీటి ట్యాంకును ఆకస్మికంగా పరిశీలించారు. మంచినీటి ట్యాంకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. అలాగే ఎప్పటికప్పుడు ట్యాంకును క్లోరినేషన్ చేసి ప్రజలకు మంచినీటిని సరఫరా చేయాలన్నారు. ఇందులో డిప్యూటీ ఎంపీడీవో శంకరరావు, గ్రామ అభివృద్ధి అధికారి, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మంచినీటి ట్యాంకును పరిశీలించిన ఎంపీడీవో


