అన్నమయ్య: మదనపల్లెలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న హరిత అనే మహిళకు అత్యవసరంగా రక్తం అవసరమని తెలియడంతో రాముడు యువసేన వెంటనే స్పందించింది. సాదిక్ రక్తదానం చేసి మహిళకు అవసరమైన రక్తాన్ని అందించారు. ఆపదలో స్పందించి రక్తదానం చేసిన సాదిక్‌ను పలువురు అభినందించారు. కార్యక్రమంలో షేక్ అబ్రార్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రక్తదానం చేసి మహిళ ప్రాణాలు కాపాడిన యువకుడు


