PPM: పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా సోమవారం నీలకంఠాపురం సంతలో ఎస్సై రమేష్ నాయుడు అవగాహన సమావేశం నిర్వహించారు. రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, హక్కులకు భంగం కలిగేలా ఎవరూ వ్యవహరించకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు దొర, చిన్నారావు, హోంగార్డు రామారావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పౌర హక్కులపై అవగాహన కల్పించిన ఎస్సై


